ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాల,సెప్టెంబర్15(జనంసాక్షి): ఈ నెల 15, 16 వరకు తమ ఓటరుగా నమోదు చేసుకోవడానికి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి జిల్లాలోని అన్ని బూత్‌లలో బీఎల్‌వో అధికారులు ఉంటారనీ, అక్కడ కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పని సరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. వంబర్ 8 చివరి జాబితాను రూపొందించీ, రాబోయే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో 1,83,016, ధర్మపురిలో 1,98,534, కోరుట్లలో 1,96,356 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటరు నమోదులో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, సేవలను కూడా వినియోగిస్తామనీ, ప్రతి ఒక్కరూ 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు నమోదు కోసం జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ 18004254247ను అందుబాటులో ఉంచామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓటరు జాబితా ప్రధాన అంశమనీ, ఎన్నికలు సజావుగా జరగడానికి దోహదపడుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 25 వరకు ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరిచూసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 5,77,906 ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారన్నారు. ఆన్‌లైన్‌లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చాన్నారు. ఈనెల 25న చివరి జాబితాను విడుదల చేస్తామన్నారు.