ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
కరీంనగర్,సెప్టెంబర్14(జనంసాక్షి): ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కరీంనగర్ జిల్లా జయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ సూచించారు.ఓటరు నమోదు కార్యక్రమంపై బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బూత్‌స్థాయి అధికారులు, పర్యవేక్షకులు ఓటరు నమోదు కోసం ఇంటింటా తిరగాలన్నారు. 01.01.2018 నాటికి 18 ఏళ్లు నిండినవారిని ఓటరుగా ఫారం-6తో ఓటర్ల జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. ఆయా ఓటర్లు ఎవరైనా మృతి చెందినట్లైతే వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని పేర్కొన్నారు. అధికారుల సూచనల మేరకు నమోదు పక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అలాగే బీఎల్‌వోలు ఈ నెల 14 నుంచి 25 వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగించాలని సూచించారు.