ఓటర్ల జాబితాలోని తప్పులకు బీఎల్ ఓలదే బాధ్యత
లక్సెట్టిపేట : ఓటర్ల బాబితాలో దొర్లిన తప్పులకు బూత్‌స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని మంచిర్యాల రాజశ్వ మండల అధికారి నర్సింగరావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని వైశ్య భవన్‌లో మంచిర్యాల , లక్సెట్టిపేట, దండేపల్లి, జెన్నారం మండలాల బూత్‌స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 16నుంచి నిర్వహించే ఇంటింటి సర్వే సందర్భంగా జాబితాలో మార్పులు చేర్పులను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట, మంచిర్యాల , జెన్నారం తహశీల్దార్లు రమేశ్‌బాబు, కిషన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



