ఓటర్ల నమోదు పనితీరు సమీక్షించిన ఎన్నికల అధికారి
విజయనగరం, ఆగస్టు 1 : జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమాల పని తీరును పరిశీలించు నిమిత్తం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వి. వెంకటేశ్వరరావు బుధవారం జిల్లాకు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎం.ఆర్.ఓ. కార్యాలయం, బాలాజీ షాపింక్ కాంప్లెక్స్, ఎం.ఆర్.కాలేజ్, ఎన్.సి.ఎస్. థియేటరులలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లను, ఎం.ఆర్. కాలేజ్ కంటోన్మెంటు మున్సిపల్ స్కూల్‌ల్లో ఏర్పాటు చేసిన బి.ఎల్.ఓ. నేమ్ బోర్డులను పరిశీలించారు. అనంతరం ఎం.ఆర్.ఓ కార్యాలయంలో జమ్ము నారాయణ పురం పోలింగ్ స్టేషన్ నెంబరు 205కు సంబంధిత వివరాలు అడుగగా జమ్మునారాయణపురం బూత్ లెవెల్ అధికారి టి. కృష్ణమోహన్ ఫారం నెంబరు 6 నందు 17మంది పేర్లు కొత్తగా నమోదుకు ధరఖాస్తు చేసుకున్నారని, ఫారం నెంబరు 7లో 9మంది మరణించినట్లు, 10మంది మైగ్రెషన్ మార్పులకు సంబంధించి ధరఖాస్తులు అందాయని, ఫారం నెంబరు 8, 8ఎ క్రింద ఏమి నమోదు కాలేదని వివరించారు. అనంతరం ఎం.ఆర్.ఓ. కార్యాలంలో ఓటర్ల నమోదుకు సంబంధించిన కంప్యూటర్ల పనితీరును పరిశీలించారు. ఈ పర్యటనలో ఆర్.డి.ఓ. రాజకుమారి, విజయనగరం తహశీల్దారు లక్ష్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.