ఓటింగ్‌పై తల్లిదండ్రులకు అవగాహన

డీఈవో రవీందర్‌రెడ్డి

ఆదిలాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటు విలువపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్రపై క్విజ్‌, రోల్‌ప్లే, డిబెట్‌ నిర్వహించారు. సాధారణ ఎన్నికలు ఎలా జరుగుతాయో అలాగే విద్యార్థులతో పోలింగ్‌ చేపట్టారు. ఈ మాక్‌పోలింగ్‌ ఎన్నికలను జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు విలువపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మాక్‌పోలింగ్‌ నిర్వహణపై డీఈవో సంతోషం వ్యక్తం చేశారు. రానున్న పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు కష్టపడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆదివారం జిల్లా స్థాయిలో మాక్‌ పోలింగ్‌ నిర్వహణ ఉంటుందన్నారు. మాక్‌పోలింగ్‌లో కజ్జర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు.