ఓటుకు నోటుపై జోక్యం చేసుకోం

2

– కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,జూన్‌16(జనంసాక్షి):

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిరాకరించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి చూస్తారని మంత్రి చెప్పారు. సెక్షన్‌-8 వ్యవహారాన్ని కూడా ¬ంశాఖ కార్యదర్శి చూసుకుంటారని కేంద్రమంత్రి అన్నారు. ఈ విషయంలో ఇంతకన్నా తాను చెప్పగలిగేది లేదన్నారు. ఇదిలావుంటే ఈ వ్యవహారంలో తలదూర్చవద్దని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆధారాలుంటే రాష్ట్రం చూసుకుంటుందన్న అభిప్రాయంలో ఉన్నట్లు సమాచరాం. ఈ వ్యవహారంలో ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా పూర్తి సమాచారాన్ని తీసుకున్న కేంద్రం ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటోందని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను కాపాడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే.అయితే  ఈ వ్యహారంలో ముందే పూర్తి సమాచారాన్ని సేకరించిన కేంద్రం జోక్యానికి నో చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ ఏసీబీ కూడా కేంద్రానికి పూర్తి సమాచారం ఇచ్చిందని  సమాచారం.  కేంద్రంకు పూర్తి వివరాలు ఇచ్చినందున ఏసీబీ కూడా తన విచారణలో వేగాన్ని పెంచింది. చంద్రబాబు తదితరులకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ఇప్పటికే గవర్నర్‌, ముఖ్యమంత్రి తదితరులకు కూడా సమాచారం అందించిన సంగతి తెలిసిందే.