ఓటుకు నోటు కేసులో బాబు తప్పించుకోలేడు

5

– మంత్రి హరీష్‌

ఖమ్మం,జూన్‌16(జనంసాక్షి):చంద్రబాబు నాయుడు వేల తప్పుడు కేసులు పెట్టినా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోలేడని,  రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ గవర్నర్‌పై ఆరోపణలు చేసిన ఏపీ ప్రభుత్వంను భర్తరఫ్‌ చేయాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఈ కేసునుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని అన్నారు.

ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరందిస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు. రైతును రాజుగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రులు  స్పష్టం చేశారు. సాగర్‌ ఎడమ కాలువ ఆధునికీకరణ పనులను మంగళవారం ఉదయం పరిశీలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం సవిూపంలోని విశ్రాంతి భవనంలో బస చేసిన మంత్రులు ఉదయం పాలేరు జలాశయం నుంచి పర్యటనను ప్రారంభించారు. జిల్లాలోని పల్లిగూడెంలో రూ.3 కోట్లతో చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణ పనులను తెలంగాణ మంత్రులు  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగర్‌ ఎడమ కాలువ కట్ట పటిష్టత పనులను పరిశీలించారు. పెరిక సింగారం సవిూపంలో కాలువ పనులు నాసిరకంగా ఉండటంపై మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడమ కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఈ సందర్భంగా స్థానికులు మంత్రులకు వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవిత, డీసీసీబి అధ్యక్షుడు విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఎన్‌ఎస్పీ అధికారులు పాల్గొన్నారు. . ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఎన్‌ఎస్‌పీ కాలువ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతును రాజుగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రులు హరీష్‌రావు, తుమ్మల స్పష్టం చేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణలో అక్రమాలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. 45 టీఎంసీల రాష్ట్ర వాటా ప్రకారమే పాలమూరు ఎతత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాకా ఇంకా ఇక్కడ టీడీపీ, వైసీపీ పార్టీలు అవసరమా? అని మంత్రి హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడి నీళ్లు తాగుతూ తెలంగాణ ప్రాజెక్టులు వద్దనే వారు ఇక్కడ ఎలా ఉంటారని విమర్శించారు.