ఓటుకు నోటు కేసులో బాబే అసలు దోషి
ఆధారాలున్నాయి : హోం మంత్రి నాయిని
వరంగల్,జూన్3(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో అసలు దోషి ఆంధ్రఫ్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా రేవంత్ పట్టుబడ్డాడన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నయని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్ పర్యటనలో ఉన్న నాయిని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలులో ప్రధాన సూత్రదారి చంద్రబాబే అని అన్నారు. రేవంత్‌కు ఎమ్మెల్యేలతో డీల్ చేసే ధైర్యం లేదని, బాబు ప్రోత్సాహంతోనే ఇలా చేశాడని అన్నారు. బాబు ఫోన్ సంభాషణలపై తమవద్ద రుజువులు ఉన్నాయన్నారు. చంద్రబాబును కూడా ఈ కేసులో విచారించాలన్న డిమాండ్ ఉందన్నారు. చంద్రబాబు ప్రధాన ముద్దాయేనని అన్నారు. ప్రధాన నిందితుడు చంద్రబాబేనని ప్రజలు అంటున్నరు. బాబు ప్రోద్బలంతోనే రేవంత్‌రెడ్డి అలా చేసి ఉంటిడనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనే క్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణలు తమ దగ్గర ఉన్నాయని ¬ంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని నాయిని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరమాడారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాల ఫోన్ సంభాషణలు కూడా తమ దగ్గర ఉన్నాయని నాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సవిూకరణాలు తారుమారు కానున్నాయని ఆయన అన్నారు. త్వరలోనే ఆధారాలన్నీ బయట పెడుతామని నాయిని నరసింహారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత బంగారు తెలంగాణలో భాగం కావాలన్న ఉద్దేశంతోనే పలువురు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. తమకు పూర్తి మెజార్టీ ఉందని, ఎవరిని కొనుక్కునే అవసరం లేదన్నారు. చంద్రబాబు పేరు చెప్పొద్దని రేవంత్ వద్దకు ఎమ్మెల్యేలను రాయబారంగా పంపారని అన్నారు. కేసుపై విచారణ జరుగుతున్నందున వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే నీచరాజకీయాలకు ఒడిగట్టడం బాబుకు అలవాటేనని అన్నారు. అదే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నరు. ఎన్నికల్లో చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా అమలు చేస్తున్నరని నాయిని పేర్కొన్నారు.