ఓటెస్తే 5 కోట్లు వెయ్యకుంటే 2 కొట్లు

4

– బాబు నాతో మాట్లాడాడు

– కోర్టులో స్టీఫెన్‌ వాంగ్మూలం

హైదరాబాద్‌,జూన్‌20(జనంసాక్షి): తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓటేయకుంటే రూ. 2 కోట్లు, టీడీపీ అభ్యర్ధికి ఓటేస్తే రూ. 5 కోట్లు ఇస్తామని తనకు ఆఫర్‌ చేశారని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఆయన నాంపల్లి కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. పోలింగ్‌ రోజు గైర్హాజరై విదేశాలకు వెళ్తానంటే విమానం టికెట్‌ కూడా ఇస్తామని చెప్పినట్టు స్టీఫెన్‌ సన్‌ వివరించారు.

ఓటుకు నోటు వ్యవహారంలో తన ఫిర్యాదుతోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలం ప్రకారం.. ”జెరూసలెం మత్తయ్య, సెబాస్టియన్‌ నన్ను కలిశారు. ఓటు వేయకుండా విదేశాలకు వెళ్లాలని సూచించారు. ఓటును అమ్ముకోవడం నేరమని తెలిసి నేను ఏసీబీకి ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు మా ఇంట్లో టీవీ స్టాండ్‌ దగ్గర ఆడియో, వీడియో రికార్డింగ్‌ సౌకర్యం ఉన్న ఐఫోన్‌ను అమర్చారు. ఈ డీల్‌లో ముఖ్యనేతలు టచ్‌లోకి వస్తేనే మాట్లాడతానని చెప్పా. దీంతో రేవంత్‌రెడ్డి టచ్‌లోకి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడిస్తానని నాతో సెబాస్టియన్‌ చెప్పారు. చంద్రబాబు విూటింగ్‌లలో ఉండటంతో మాట్లాడేందుకు కుదరలేదు. ఆరోజు సాయంత్రం సెబాస్టియన్‌ నాకు ఫోన్‌ చేశారు. చంద్రబాబు మాట్లాడుతారంటూ ఫోన్‌ ఆయనకు ఇచ్చారు. మా వాళ్లు నాకు బ్రీఫ్‌ చేశారు విూరు ఫ్రీగా నిర్ణయం తీసుకోండి విూకు అండగా నేను ఉంటానని చంద్రబాబు అన్నారు. వాళ్లు చెప్పినట్టుగా ఐదు కోట్లు ఇస్తామని హావిూ ఇచ్చారు.” అని స్టీఫెన్‌ సన్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.