ఓటేయండి… పెట్రోల్‌ ధర తగ్గిస్తాం


` అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం
` తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం
` గెలిచిన వెంటనే పెట్రోల్‌ , డీజిల్‌ ధరల తగ్గింపు
` పివిని అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
` హుజూరాబాద్‌తో సీఎం కేసీఆర్‌కు ట్రైలర్‌ చూపించాం
` ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు
` బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తాం
` కరీంనగర్‌,మహబూబాబాద్‌ సకల జనుల విజయ సంకల్ప సభల్లో ప్రధాని మోదీ.
కరీంనగర్‌ బ్యూరో,మహబూబాబాద్‌ (జనంసాక్షి): ఉపఎన్నికల్లో ఫాంహౌజ్‌ సీఎం కేసీఆర్‌ కు ట్రైలర్‌ చూపించిన కరీంనగర్‌ గడ్డ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రసంగించిన మోదీ కేసీఆర్‌ సర్కార్‌, కాంగ్రెస్‌ పై నిప్పులు చెరిగారు. మరోవైపు బిజెపి వల్ల తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను వివరించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు… అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ వేములవాడ రాజన్నను స్మరించుకున్నారు. శాతవాహన, కాకతీయులు, మౌర్యుల కర్మభూమి అయిన ఈ గడ్డకు నమస్కారాలు అంటూ కరీంనగర్‌ చరిత్రను గర్తు చేశారు. సంజయ్‌ సూపర్‌ ఫాస్ట్‌… విూరు కూడా సంజయ్‌ సూపర్‌ ఫాస్ట్‌ ను అందుకోవాలంటూ సభలో పాల్గొన్న కరీంనగర్‌ ప్రజలకు సూచించారు. ఈ సభలో మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మిమ్మల్ని చూస్తుంటే తెలంగాణ ఉజ్జ్వల భవిష్యత్తు నాకు కనిపిస్తున్నదని  పెద్ద సంఖ్యలో మిమ్మల్ని చూస్తుంటే ఈ వేదిక చాలా చిన్నిదైపోయిందని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన విూకు వందనాలు అని కరీంనగర్‌ లోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఫాంహౌజ్‌ సీఎం కేసీఆర్‌ కు ట్రైలర్‌ చూపించారని ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ఖేల్‌ ఖతమవుతుందన్నారు. యావత్‌ తెలంగాణ, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా నేను ఎక్కడకు పోయినా తెలంగాణ అంతా ఒక్కటే మాట చెప్తోందని  తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తుందని తెలంగాణలో తొలిసారి అని మోదీ అంటే  బిజెపి సర్కార్‌ వస్తుందని సభికులు నినదించారు. మొదటిసారి తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వంలో తొలి సీఎం బీసీ వర్గం నుంచే ఉంటారని బిజెపి హావిూ ఇస్తుందని వచ్చే 5 సంవత్సరాలు తెలంగాణ ప్రగతి కోసం చాలా ముఖ్యమైనవి ఎందుకంటే తెలంగాణ వయస్సు 10 సంవత్సరాలు, 5 ఏళ్ల తర్వాత 15 ఏళ్లు అవుతుందని 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్లు పిల్లలకు ఎంత ముఖ్యమో  ఈ 5 ఏళ్లు తెలంగాణకు చాలా ముఖ్యమైనదని ఇప్పుడు తెలంగాణలో ప్రయోగం చేయలేం…  పొరబాటు చేయలేం… తెలంగాణను దాని అదృష్టానికి దానిని వదలలేం… అందుకే తెలంగాణకు బిజెపి ప్రభుత్వం చాలా అవసరం అన్నారు. దేశ అభివృద్ధి బిజెపి మొదటి ప్రాధాన్యత ఎవరైనా దేశం కోసం ఓటు వేసామంటే… అది బిజెపికే అని అర్థమయితది… అభివృద్ధి కోసం… దేశ ఆత్మగౌరవం కోసం…. గరీబ్‌ కళ్యాణ్‌ కోసం ఓటు వేసామంటే… బిజెపికే అని అర్థమయితది… ఇలాంటి విశ్వాసమే తెలంగాణ మూలమూలన కనిపిస్తోందన్నారు. తెలంగాణలో పరివర్తన కనిపిస్తోంది… ఇక్కడ మార్పు నిశ్చయం… ప్రజలు బీఆర్‌ఎస్‌ ను పరుగెత్తిస్తారు,  కాంగ్రెస్‌ ను అడ్డుకుంటారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ కేసీఆర్‌ ప్రజలను మోసం చేసేందుకు ఎలాంటి అవకాశం వదిలిపెట్టవు అవినీతి, కుటుంబ రాజకీయాలు, సంతుష్టీకరణ అంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ గుర్తొస్తాయని కాంగ్రెస్‌ సభ్యులకు గ్యారెంటీ లేదని వాళ్లు ఎప్పుడైనా బీఆర్‌ఎస్‌ లో చేరుతారు. అందుకే ఎవరూ కాంగ్రెస్‌ కు ఓటేయరు. కాంగ్రెస్‌ కు ఓటు వేయడం అంటే మళ్లీ కేసీఆర్‌ ను గద్దె ఎక్కించడమే అందుకే పొరబాటున కూడా కాంగ్రెస్‌ కు ఓటు వేయొద్దని మార్పునకు ఒకటే మందు కమలం బటన్‌ నొక్కాలని బిజెపిని గెలిపించాలన్నారు. కుటుంబవాదంతో ప్రతిభకు ఎంతటి అన్యాయం జరుగుతుందో ఈ గడ్డను చూస్తే తెలుస్తుందని ఈ గడ్డ పి.వి. నరసింహా రావు లాంటి వ్యక్తిని అందించిందని అతన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా అవమానించిందని చనిపోయిన తర్వాత కూడా పివీని అవమానించింది. కుటుంబవాదం తమ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తుంది. విూ పిల్లల గురించి కాదు, బీఆర్‌ఎస్‌ అయినా , కాంగ్రెస్‌ అయినా , విూ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసేందుకు ఏ అవకాశం వదిలిపెట్టదన్నారు.కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఒక్కటే.. ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. బిజెపి మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని తెలుగులో వ్యాఖ్యానించారు.కుటుంబవాద పార్టీలు చట్టాన్ని దుర్వినియోగం చేస్తాయని కాంగ్రెస్‌ ఉన్నప్పుడు బాంబు పేలుళ్లు జరిగాయని కాంగ్రెస్‌ ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ వంటి దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్‌ హయాంలో కరీంనగర్‌ లో నక్సల్స్‌ హింస చెలరేగిందని బిజెపి ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని తెలంగాణ ప్రజలందరికీ తెలుసని బీఆర్‌ఎస్‌ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందో చూస్తున్నారన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం మొత్తం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుంది. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కోసం మోదీ సర్కార్‌ నిధులు ఇచ్చిందని కానీ కేసీఆర్‌ సర్కార్‌ అడ్డుకుందని కేసీఆర్‌ కరీంనగర్‌ ను లండన్‌ చేస్తానని తప్పుడు వాగ్దానం చేశారు. కానీ బిజెపి తోనే కరీంనగర్‌ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్‌ సాగునీటి పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని కాళేశ్వరం అవినీతి గురించి తెలంగాణనే కాదు… యావత్‌ దేశం కు తెలుసని అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ కు తగిన శిక్ష పడాలా… వద్దా…? అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ చిన్న, సన్నకారు రైతుల ఉసురు పోసుకుందని మోదీ సర్కార్‌ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం చేసిందని  ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసిందన్నారు. ఫిలిగ్రీ కళకు కరీంనగర్‌ ప్రసిద్ధి చెందిందని మన్‌ కీ బాత్‌ లో కూడా ప్రస్తావించాను అని స్వర్ణకారులు, కళాకారుల కోసం పీఎం విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టామని దీని ద్వారా ఇక్కడి ఫిలిగ్రీ కళాకారులకు ఆధునిక ట్రైనింగ్‌, లక్షల రూపాయల రుణం లభిస్తుందని కరీంనగర్‌ ను సిల్వర్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు బిజెపి కృషి చేస్తుందని నేను వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది కరీంనగర్‌ బాగు కోసమే అని తెలిపారు.తెలంగాణకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కాదు… కాంగ్రెస్‌ సర్కార్‌ కాదు…. తన గ్యారెంటీలను పూర్తి చేసే బిజెపి సర్కార్‌ తెలంగాణకు కావాలన్నారు.అందరికీ ఉచిత రేషన్‌ ఇవ్వడం, ఉచిత వైద్యం అందించడం, చవక ధరకు మందులు అందించడం, రైతులందరికీ ప్రోత్సాహం, సాయం అందించడం, అవినీతి, కుటుంబాదం, సంతుష్టీకరణ నుంచి విముక్తి కల్పించడం, పేదల సంక్షేమం మోదీ ఇచ్చే గ్యారెంటీ  ఒకవైపు ఫాంహౌజ్‌ సీఎం మరోవైపు విూ సేవకుడు మోదీ అన్నారు. కేసీఆర్‌ పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వలేదని మోదీ పేదలకు లక్షల ఇండ్లు కట్టిస్తే వాటిని ఈ ప్రభుత్వం పేదలకు అందకుండా చేసిందని ఇలాంటి ప్రభుత్వానికి ప్రతి పేద వ్యక్తి వ్యక్తి శిక్షించాలన్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉంటాయని ఇక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ రూపంలో ప్రజల నుంచి డబ్బులు లూటీ చేస్తుందని బిజెపి సర్కార్‌ వచ్చిన తొలిరోజే పెట్రోల్‌ బంకులో విూకు దాని ఫలితం కనిపిస్తుందన్నారు. మోదీ  గ్యారెంటీ అంటే  గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అని తెలుగులో వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యం అని తెలుగులో వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్మాణం కేసీఆర్‌ కోసమా… అందుకే తెలంగాణ తెచ్చకొన్నామా…? కేసీఆర్‌ నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చారా? కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగులు ఇచ్చారన్నారు.ప్రతి కోనా ఒకటే గానా… బిజెపి దే తెలంగాణ అని నినదించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నావ మునిగిపోతుందని ఇది బీఆర్‌ఎస్‌ కు కూడా అర్థమయిందని డిసెంబర్‌ 3న వాళ్ల కరెంట్‌ కట్‌ అవుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక లిక్కర్‌ స్కాం దర్యాప్తు వేగవంతమవుతుందని  కేసీఆర్‌ కు చెమటలు పట్టిస్తుందని బిజెపి మాత్రమే బీఆర్‌ఎస్‌ కు బుద్ధి చెప్తుందని వాళ్లు దోచుకున్న సొమ్ము కక్కిస్తుందన్నారు. పొరబాటున కానీ కాంగ్రెస్‌ వస్తే  వాళ్లకు తెలంగాణ ఏటీఎం అవుతుందని  తెలంగాణ కొన్నేళ్లు వెనక్కుపోతుందని కాంగ్రెస్‌ వస్తే ప్రతి సంక్షేమ పథకంలో దోపిడీ జరుగుతుందని విూకు నా విన్నప్పం  ఒక రోగాన్ని తగ్గించేందుకు మరొక్క రోగాన్ని తెచ్చుకోవద్దని  అభివృద్ధిలో వెనక్కు పడిన తెలంగాణను కాంగ్రెస్‌ మరింత భ్రష్టు పట్టిస్తుందని విూరు బిజెపిపై భరోసా , మోదీపై భరోసా చూపండన్నారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని మౌలిక వసతులు అభివృద్ధి చేస్తుందని ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుందని రైతుల సమస్యలు పరిష్కరిస్తుందని మహిళలకు సులభతర జీవనం అందిస్తుందని బీసీ వ్యక్తిని సీఎం చేస్తుందని మాదిగలకు న్యాయం చేస్తుందన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ సర్కార్‌ కే పట్టం కట్టనున్నారని ఇక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పడితే  తెలంగాణ అభివృద్ధికి నాకు సపోర్ట్‌ వస్తుందని  అందుకే బిజెపిని గెలిపించండి అని తెలిపారు. బిజెపి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తెలంగాణను ప్రగతిపథంపై వేగంగా దూసుకెళ్లేలా చేస్తుందని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు బిజెపి రావాలని అంటూ సభికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.