ఓపిక నశిస్తే పోరు తప్పదు


` చేనేత,జౌళి రంగాలను ఆదుకోండి
` టెక్స్‌టైట్‌ పార్కుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
` కేంద్రానికి కేటీఆర్‌ ఘాటు లేఖ
` లేఖ కాపీని బండి సంజయ్‌కు కూడా పంపామని వెల్లడి
రాజన్నసిరిసిల్ల,జనవరి 21(జనంసాక్షి):టెక్స్‌టైల్‌ పార్కుకు నిధుల కోసం కేంద్రాన్ని పలుమార్లు కోరినా ఎలాంటి స్పందన లేదని పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈవిషయంలో ఎంతటి పోరాటికైనా సిద్దమేనని అన్నారు.
సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన చేపట్టిన మంత్రి కేటీఆర్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సవిూక్ష నిర్వహించారు. జిల్లాలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, పాఠశాలల ఆధునీకరణ, చేనేత రంగంపై అధికారులతో చర్చించారు. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఏడున్నర ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా…. మోదీ సర్కార్‌ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తాజాగా ప్రవేశ పెట్టబోయే కేంద్ర బ్జడెట్‌లోనైనా రాష్టాన్రికిన్యాయం చేయాలని కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా పంపిస్తున్నామని… రాజకీయాలు మాని రాష్ట్ర నేతల కోసం పనిచేయాలని కేటీఆర్‌ హితవు పలికారు. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని స్పష్టంచేశారు. నేతన్నలకు కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. నేతన్నలకు అండగా నిలిచే ప్రయత్నం కేంద్రం చేయట్లేదు. నేతన్నలకు చేదోడుగా నిలవాలని కేంద్రమంత్రికి లేఖ పంపాం. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు వరంగల్‌లో ఏర్పాటవుతోంది. 1200 ఎకరాల్లో కాకతీయ మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండు పరిశ్రమల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. టెక్స్‌టైల్‌ పార్కుకు నిధుల కోసం కేంద్రాన్ని పలుమార్లు కోరాం. టెక్స్‌టైల్‌ పార్కుకు రూ.897 కోట్లు మంజూరు చేయాలని.. చేనేత, మరమగ్గాల ఆధునీకరణకు సహకరించాలని కోరాం. ఆధునీకరణ కోసం రాష్ట్రం కూడా సగం నిధులు భరిస్తుంది. రాష్టాన్రికి 13 చేనేత సమూహాలు మంజూరు చేయాలి. సిరిసిల్లకు మెగాపవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలి. కేంద్ర బ్జడెట్‌లో రాష్టాన్రికి నిధులు మంజూరు చేయాలి. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని కేటీఆర్‌ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటినుండి కేంద్రం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్టులలో ఇక్కడి నేతన్నలకు కేంద్రం పట్టించుకున్నది ఏవిూలేదు. వరంగల్‌ లోని కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్కుకు కేంద్రం ఎనిమిది వందల్‌ తొంభై ఏడు కోట్ల తొంబ్బై రెండు లక్షలు మంజూరు చేయించాలని బండి సంజయ్‌కు డిమాండ్‌ చేశారు. పోచంపల్లి కేంద్రంగా ఇండియన్‌ ఇన్ట్సిట్యూట్‌ ఒయా హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేసే బాధ్యత బండి సంజయ్‌ దే అన్నారు. లూమ్‌ అప్‌ గ్రడేషన్‌ పథకానికి కేంద్రం సహాయం చేయాలి. టెక్స్‌ టైల్‌ రీసెర్చ్‌ ఇన్ట్సిట్యూట్‌ ను కేంద్రం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో కొత్తగా పదకొండు చేనేత సమూహాలను బండి సంజయ్‌ మంజూరు చేయాలి. మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ను యంపి బండి సంజయ్‌ మంజూరు చేయించాలి. మంజూరు చేయకపోతే రాష్ట్రంలోని నేతన్నలను ఏకం చేసి పోరాటం చేస్తాం అన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో 479 బృందాలు ఫీవర్‌ సర్వే చేస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచామన్నారు. బూస్టర్‌ డోస్‌ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు కేటీఆర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ తీవ్రత అంత ఎక్కువ లేదని వైద్యారోగ్యశాఖ చెబుతోందని కేటీఆర్‌ తెలిపారు. వేములవాడలో వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందన్నారు. సిరిసిల్ల, ములుగు జిల్లాలు హెల్త్‌ ప్గ్రొªల్‌ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయని.. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభమవు తాయన్నారు. నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎస్సీ లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టామని… జిల్లాలో 510 పాఠశాలల స్థితిగతులపై సవిూక్షించినట్టు పేర్కొన్నారు. మూడు దశల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల ఆధునీకరణ జరుగనుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభమవుతుందని తెలిపారు.తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. జిల్లాలో కరోన థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు చేశాం అన్నారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించాము. వాక్సినేషన్లో రాష్ట్రములోనే జిల్లా ఐదవ స్థానములో ఉంది. జిల్లాలో నాలుగు వందల డెబ్బైతొమ్మిది వైద్య బృందాలు లక్షా యాభై వేల ఇండ్లు ఫీవర్‌ సర్వే చేస్తున్నాయన్నారు. రాష్ట్రములో జిల్లా హెల్త్‌ ప్గ్రొªల్‌ స్కీంకు పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపికైంది. ఫిబ్రవరిలో మొదటి వారములో పనులు ప్రారంభవుతాయన్నారు. జిల్లాలోని పదమూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మొదటి విడత దళిత బందు లబ్దిదారుల ఎంపిక ప్రారంభిస్తాం.
జిల్లాలో మనఊరు మనబడిలో భాగముగా ఐదువందల పది పాఠశాలలను మూడు సంవత్సరాలలో ఆధునీకరిస్తాం.

తాజావార్తలు