ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభం

ఆదిలాబాద్‌ రూరల్‌ , టీ మీడియా : జిల్లాలో ఆంద్రప్రదేశ్‌ సార్వవూతిక పదోతరగతి, ఇంటర్‌మీడియట్‌ ఓపెన్‌ వార్షిక పరీక్షలు గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా పరీక్ష కేంద్రాలు మండాలాల వారిగా కికుండా మొదటి సారి రెవిన్యు డివిజన్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు , ఇంటర్‌ విధ్యార్థులు తెలుగు సబ్జెక్టులో పరీక్ష నిర్వహించారు. ఇందుకు 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన పరీక్షకు 4355మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ,3809 మంది హాజరుకాగా, 546 మంది అభ్యర్థులు గైర్హుజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికరి అక్రముల్లాఖాన్‌ తెలిపారు. అలాగె పదో తరగతి పరీక్షల్లో నలుగురు విద్యార్థులు కావాల్సి ఉండగా ఒకరు మాత్రమే గైర్హజరయాని, ఉదయం జరిగిన పరీక్షల్లో 31 మంది విద్యార్థులను మాస్‌కాపింగ్‌కు పాల్పడుతుండగా పట్టుకొని డీబార్‌ చేసినట్లు ఆయన తెలిపారు.
మంచిర్యాల లో 12, నిర్మాల్‌ 13, ఉట్నూర్‌లో 6మంది విద్యార్థులు ఇందులో ఉన్నారన్నారు. అలాగే మద్యాహ్నం జరిగినా పదోతరగతి తెలుగు సబ్జెక్టులో 3651 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండాగా 3152 మంది విద్యార్థులు హాజరు కాగా 463 మంది విద్యార్థులు గైర్హజరు అయ్యారన్నారు. ఈ పరీక్షలో 9 మంది విద్యార్థులు డీబర్‌ చేసినట్లు ఉట్నూరు కాన్వెంటులో ముగ్గురు, ఉట్నూరు తెలుగు మీడియంలో ఒకరు, మంచిర్యాల ట్రినిటి హైస్కూల్‌ నలుగురు ఓల్డ్‌ మంచిర్యాల్‌లో ఒకరు మాస్‌ కాపింగ్‌కు పాల్పడుతుండగా పట్టుకోని డీబార్‌ చేసినట్లు ఆయన తెలిపారు.