ఓబీసీ కోటా ఉండాలలి: రాహుల్‌

ఢల్లీి(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్‌ సమర్థించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.మహిళలకు అధికారం బదలాయింపు విషయంలో పంచాయతీరాజ్‌ ఒక కీలక అడుగు అయితే.. ఇది మరో పెద్ద ముందడుగు అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్‌ మాట్లాడారు. ఒక అంశం మహిళా రిజర్వేషన్‌ బిల్లును అసంపూర్తిగా మిగుల్చుతోందన్న రాహుల్‌.. ఓబీసీ రిజర్వేషన్‌ను చేర్చాలని కోరారు. ఓబీసీ కోటా లేకపోతే ఈ బిల్లు అసంపూర్తిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.అయితే, మహిళా రిజర్వేషన్ల అమలుకు జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ అవసరమనే కేంద్రం ఆలోచన మాత్రం వింతగా ఉందని రాహుల్‌ అన్నారు. ఈ బిల్లును ఈరోజే అమలులోకి తేవొచ్చని రాహుల్‌ అన్నారు. నూతన పార్లమెంట్‌ భవనం గురించి మాట్లాడుతూ.. చాలా బాగుందని.. ఈ ప్రక్రియలో రాష్ట్రపతిని చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ రాష్ట్రపతిగా ఉన్నారని.. కొత్త పార్లమెంటుకు మారినప్పుడు ఆమె కనిపించడం సముచితంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శులలో ముగ్గురు మాత్రమే ఓబీసీలు అని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు.