ఓరుగల్లులో ప్రారంభమైన శ్రీ భద్రకాళి బ్రహోత్సవాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: వరంగల్‌ జిల్తాలోని ఓరుగల్లులో వెలసిన శ్రీ భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఆదివారం తెరాస ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. పది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణలో ఉన్న అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ఉదయం అభిషేకం జరిగిందని, సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ సేవ చేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు.