ఓల్డ్ సిటీకి మెట్రోరైలు
పనులు వేగవంతం చేయండి – హైదరాబాద్ రోడ్డు పనులకు ప్రతిపాదనలు అభివృద్ధి పనులపై తక్షణ కార్యాచరణ – అధికారులతో సమీక్షించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొం దించాలని ఇంజనీరింగ్ అధికారులను మున్సిప ల శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జీహెచ్ఎంసి చేపట్టిన పనులను వేగంగా పూర్తిచే యాలని కూడా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బుధవారం జీహెచ్ఎంసి కార్యాలయంలో ఎస్ఆర్ డిపి కింద మంజూరైన ప్లయ్ ఓవర్లు, అండర్ పాన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణపనులు, మెట్రోలైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మంచినీటి సరఫరా, పై న్లు , క్రీడా మైదానాల నిర్మాణం తదితర పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాునీటి సరఫరాలో పైన్స్ లీకేజీల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు దెబ్బతిన్న పైన్ స్థానంలో కొత్త పైన్లు వేయాలని అన్నారు. చివరి ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసుందుకు కొత్తగా పై న్లను నిర్మించాలని కూడా తెలిపారు. ఈ ప్రాంతంలో మురుగునీ పారుదల వ్యవస్థను ఆధునీకరించేందుకు నాలాల విస్తరణకు 200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్టు తెలిపారు. మౌలిక వసతుల విస్తరణలో భాగంగా 20రోడ్లను వెడల్పు చేసేందుకు ప్రతిపాదిత మెట్రోరైలు మార్గంలో పనులుచేట్టేందుకు అవసరమైన భూసేకరణ పక్రియను వేగవంతం చేయాలన్నారు. రోడ్ల విస్తరణకు సానుకూలంగా స్పందించిన వారి ఆస్తులను వెంటనే సేకరించాలని అన్నారు. నిబంధనల ప్రకారం చెల్లింపులు జరిపి సంబంధిత ఆస్తులను స్వాదీనం చేసుకుని నిర్మాణాలను కూల్చివేయాలన్నారు. భూసేకరణలో పార్లమెంట్ శాసన సభ్యుల సహకారాన్ని తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్ల వెడల్పుతో ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు. రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి రైల్వే అండర్‌పాస్ పనులను పూర్తిచేయాలని సూచించారు. ఈస్ట్, వెస్ట్ కారిడిలో భాగంగా మూసీ నదికి ఇరువైపులా నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిపారు. స్థలాల అందుబాటును బట్టి గజ్వేల్ తరహాలో ఇంటి గ్రేటెడ్ మోడల్ మార్కెట్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ పెరిగినందున పార్కులలో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం శాసన సభాపక్షం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబాఫసియుద్దీన్, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, వాటర్ బోర్డు ఎండి దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రణ