హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాంట్రాక్ట్ మ్యారేజీ చేసుకుంటున్న సోమాలియా వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సోమాలియాకు చెందిన అలీ మహ్మద్.. లక్ష రూపాయలు ఇచ్చి ఓల్డ్ సిటీకి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడాదిపాటు కాంట్రాక్ట్ కు తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో… బ్రోకర్ సాయంతో యువతిని తీసుకెళ్లేందుకు అలీ మహ్మద్ వచ్చాడు. విషయం తెలుసుకున్న మాదన్నపేట పోలీసులు అలీమహ్మద్ తో పాటు బ్రోకర్ ను అదుపులోకి తీసుకున్నారు.