ఓల్డ్ సిటీలో విషాదం
గుర్రం.. స్కూటీ ఢీ:వ్యక్తి మృతి
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్న గుర్రాన్ని స్కూటీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మైలార్ దేవ్ పల్లిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుర్రాన్ని ఢీ కొట్టడంతో స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. బెదిరిన గుర్రం.. కిందపడిన హమీద్ తలపై కాలుతో తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి ఖాజామ్ కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మెరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.