ఓ.. నో.. : ఇలా అయితే జియో సిమ్ బ్లాక్!

దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది దగ్గర జియో సిమ్.. ఏడు కోట్ల మందిపైనే మెంబర్ షిప్ తీసుకున్నారు.. మరికొన్ని కోట్ల మంది టారిఫ్ తీసుకున్నారు. అంతా బాగానే ఉన్నా అసలు లెక్క తేల్చే పనిలో ఉంది రిలయన్స్ కంపెనీ. స్టార్టింగ్ లో అడిగిన వారికి… అడిగినట్టు సిమ్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆ లెక్కలను సరిచేసే సనిలో పడ్డారు.  సిమ్ తో ఆధార్ లింక్ చేసుకుంటే సరే లేకుంటే… సిమ్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. నాన్‌ వెరిఫైడ్‌ సిమ్‌ కార్డులను నిషేధించనుందని తెలుస్తోంది రిలయన్స్. అలాగే e-కేవైసీ సమర్పించని ఖాతాదారులను  ఎస్‌ఎంఎస్‌ల ద్వారా హెచ్చరిస్తుంది.  లేదంటే  ప్రస్తుతం వాడుతున్న జియో సిమ్‌  ద్వారా 1977 నెంబర్‌ కాల్‌ చేసిన టెలీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. లోకల్‌ అధార్‌ కార్డుతో జియో సిమ్‌ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నాన్‌ లోకల్‌ ఆధార్‌ తో తీసుకుంటే మాత్రం టెలీ వెరిఫికేషన్‌ను ఎంచుకోవాల్సిందే. జియో ఇప్పటికే ఈ స్క్రూటినీ  ప్రక్రియ మొదలు పెట్టిందని సమాచారం. ఏప్రిల్‌ 1 నుంచి ఈ వెరిఫికేషన్‌  ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు కొంతమంది యూజర్లకు ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌లను పంపించినట్టు సమాచారం.

తాజావార్తలు