ఓ.పి లేకున్న సరే…
ఓపికతో ఎక్కడైనా వైద్యం చేస్తా….
ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 07 ,(జనం సాక్షి ) సాధారణంగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు డాక్టర్ వద్దకు వెళ్లాలంటే ఓ.పి (అవుట్ పేషెంట్ ) ఉండాల్సిందే. దీని కోసం ఆసుపత్రి యాజమాన్యం నిర్ణయించిన నిర్ణిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.కానీ అలాంటి పట్టింపులు లేకుండా తన కోసం వచ్చిన ఓ వ్యక్తిని డాక్టర్ సంజయ్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వైద్య సూచనలు ఇచ్చిన సంఘటన ఎర్దండి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఏర్దండి గ్రామంలో పలు యూత్ , గణేష్ భజన మండలి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడానికి గంగపుత్ర యూత్ వద్దకు డాక్టర్ సంజయ్ రాగ , తిమ్మాపూర్ గ్రామానికి చెందిన లక్కం అజిత్ వెన్నుపూస నుండి మోకాళ్ల వరకు తీవ్ర నొప్పితో గత కొన్ని రోజుల నుండి బాధపడుతున్నడు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్ అజిత్ ను కల్వకుంట్ల సంజయ్ ని కలవాలని సూచించగా , గణపతి మండపం వద్ద ఉన్న డాక్టర్ సంజయ్ వద్దకు రాగ , ఆయన అతన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని , అతను ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ పరిశీలించారు. ప్రస్తుతానికి నొప్పులు తగ్గడానికి తగిన మందులు రాసి , అవసరమైతే హైదరాబాద్ లోని ఆస్పత్రికి రావాలని , మెరుగైన వైద్య చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. సత్వరమే స్పందించిన సంజయ్ కి అజిత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటనతో అక్కడే ఉన్న జనాలు ఆశ్చర్యానికి లోనయ్యారు. మరికొందరు మహిళలు వచ్చి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోగా వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి , అవసరమైన వారిని ఆసుపత్రికి వచ్చి కలవమన్నారు. జనాల మధ్యలోకి వచ్చి , పలువురికి ఆరోగ్య సమస్యలపై , సూచనలు , సలహాలు , వైద్యసహాయం కోసం హామి ఇచ్చిన కల్వకుంట్ల సంజయ్ ని చూసి , జనం మధ్యలో నుంచి నాయకులు పుడతారని , జన హృదయాలను గెలుచుకున్న నేత అని అక్కడున్న ప్రజలు ఆయన్ని కొనియాడారు. ఆయన వెంట సర్పంచ్ కెల్లెడ లక్షణ గంగాధర్ ,ఉప సర్పంచ్ బట్టు శేఖర్ , నాయకులు కంఠం రమేష్ , మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్ ,జె.డి సుమన్ , దాసరి చిన్న రాజన్న , సర్పంచ్ సంఘం సాగర్ ,సుంచు సంతోష్ తదితరులు ఉన్నారు.