ఔషధాల ధరలు తగ్గించాలి.GDP లో 5% కేటాయించాలి…

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 17(జనం సాక్షి)

ఫార్మా రంగంలోని ఔషధ ధరలను తగ్గించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెసెంటెడ్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం జిపుజాత భగత్ నగర్ లో నిర్వ హించారు. నగరం లోనీ కలెక్టరేట్, గీతా భవన్, కోర్టు ,మంచిర్యాల చౌరస్తా, డాక్టర్ స్ట్రీట్ ,టవర్ సర్కిల్ మీదుగా జీపుజాత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ గత రెండేళ్లలో సామాన్య ప్రజల జీవనోపాధికి అవసరమైన వస్తువుల ధరలు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయింది.పెట్రోల్ ధరల పెరుగుదల అనంతరం ఆహార ధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. వీటితోపాటు దేశంలో మందుల ధరలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణపై చేసే ఖర్చు సగటు ప్రపంచంలోని అనేక దేశాల కంటే చాలా ఎక్కువ. ఇందులో సింహభాగం మందుల కొనుగోలుకే18% వెళుతున్నది. భారతదేశంలోని సామాన్య ప్రజల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన దాదాపు అన్ని ఔషధాలు ఇప్పుడు మధ్య మరియు పెద్ద స్థాయి ఫార్మారంగా కంపెనీలకే తయారు చేయబడుతున్నాయి. భారతదేశంలోని 55 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. 18% పైగా ప్రతి ఇంట ప్రమాదకర స్థాయిలో ఆరోగ్య ఖర్చులకు గురవుతున్నారు. మహమ్మారి కరోనా సమయం లో విదేశాల నుండి మూడు పదార్థాల కొరత కారణంగా ప్రైవేట్ భారతీయ కంపెనీలు తమ మందులు పెరుగుదలను పెంచడానికి ప్రభుత్వం పై విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి. కార్పొరేట్ ఒత్తిడిలోనైనా ప్రభుత్వం అనేక ఔషధాలను ఒకేసారి 50% వరకు పెంచడానికి అనుమతించింది. పెరుగుదలకు అనుగుణంగా అవసరమైన మందుల ధరలను కూడా పెంచడానికి కంపెనీలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ విధానం ఫలితంగా దాదాపు 850 ఔషధాలు ధరలు పెరిగాయి. మందుల ధరల నియంత్రణ ప్రాథమిక సూత్రం ఈ విదానం ద్వారా పూర్తిగా ఉల్లంఘించబడుతుంది. భవిష్యత్తులో ధరల నియంత్రణ ప్రకటన కాగితంపై మాత్రమే ఉంటుంది. వాస్తవానికి WPI వినప్పుడల్లా మందుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఔషధాలపై ఐదు శాతం, 12 శాతం ,మరియు 18% మూడు స్లాబ్ లో జిఎస్టి విధించబడుతుంది. దేశం యొక్క సామాజిక ఆర్థిక స్థితిని పరిగణలకు తీసుకునేది కచ్చితంగా చాలా ఎక్కువ. భారతదేశంలో ఏడు ప్రభుత్వ రంగా వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. ఇవి చాలా సంవత్సరాలుగా అధిక నాణ్యత గల వ్యాఖ్యలను ఉత్పత్తి చేస్తున్నాయి. మన నేషనల్ ఇమ్యునైజేషన్ పాలసీ కూడా ఈ కంపెనీ ఉత్పత్తి చేసే వ్యాక్సిల ఆధారంగా మాత్రమే అమలు చేయబడుతుంది. భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందుతున్న మరియు పేద దేశాల్లో ఈ పిఎస్ఎల్ నుండి వ్యాక్సిన్ లో సరఫరా చేయబడుతున్నాయి. ఇంకా మరి సమయంలో ఈ పీఎస్సీలను విస్మరించి ప్రభుత్వ రెండు ప్రభుత్వం ప్రవేట్ రంగ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. దీన్నిబట్టి ప్రస్తుత ప్రభుత్వం దృక్పథం ప్రజలకు వ్యతిరేకమని స్పష్టంగా కనిపిస్తుందనీ తెలిపారు.

తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రెసెంటేటివ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు పి మురళి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆరోగ్య సంరక్షణలో జీడిపిలో రెండు కంట తక్కువ ఖర్చు చేస్తుంది ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎఫ్ఎమ్ఆర్ఐ, టీమ్ ఎస్ ఆర్యులు అనేక సంవత్సరాలుగా ఈ సమస్యలపై నిరంతరం అందాలను చేస్తూనే ఉన్నాయి. ఆరోగ్యం వైద్యం సంబంధిత సమస్యలు ప్రజల ముందుకు తీసుకురావడానికి అభినందనీయనియమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి రాజేశం, జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి విద్యాసాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాస్, జిల్లా మాజీ కార్యదర్శి డి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు జేఎన్ నరసింహారెడ్డి ,ఉపాధ్యక్షులు పి నరేందర్, సి శివకుమార్, సంయుక్త కార్యదర్శి సంపత్ రెడ్డి, కే రమేష్ కోశాధికారికే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.