కంటివెలుగు కోసం స్వచ్చంద సంస్థల సహకారం

రోటరీ, లయన్సం వంటి వాటిని ఉపయోగించాలి
అంధత్వ నివారణెళి లక్ష్యంగా కంటి పరీక్షలు
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు ప్రసాదించేందుకు, తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.  రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే కలెక్టర్లు, అధికారులతో కంటి వెలుగు అవగాహన సదస్సును నిర్వహించామని అన్నారు.   రోటరీ క్లబ్‌, లయన్స్‌ క్లబ్‌, వాసవీ క్లబ్‌ వంటి స్వచ్ఛంద సంస్థలతో పాటు జిల్లాలోని ప్రైవేటు మెడికల్‌ కళాశాలలను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ కంటి చూపును పూర్తిస్థాయిలో కల్పించాలన్న గొప్ప కార్యక్రమం దేశంలోనే ప్రథమమని మంత్రి కొనియాడారు. అయితే ఈ కార్యక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్లాలని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధి హావిూ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ప్రజల్లోకి చేరుతుందని ఆ దిశగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడున్నర కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాలంటే ఆత్మైస్థెర్యం కావాలని, ఆ ధైర్యం కేవలం కేసీఆర్‌కే ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.106 కోట్ల నిధులు కంటి వెలుగు కోసం విడుదల చేసిందన్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల అనంతరం మరింత ఖర్చు పెరిగే అవకాశమున్నదని, ఆ నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు.  ఏ ఒక్కరినీ మినహాయించకుండా కంటి పరీక్షలను నిర్వహించేం దుకు ఇప్పటికే వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక వైద్య బృందం ఏర్పాటు చేశామని, పట్టణాల్లో ఒక్కో వార్డుకు ఒక బృందం పని చేస్తుందన్నారు. దాదాపు 10 మంది వైద్య సిబ్బందితో ఈ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు. అవసరమైన వారందరికీ కంటి అద్దాలు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు కంటి అద్దాలు చేరుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. మరింత అవగాహన కోసం మండల నోడల్‌ అధికారులను నియమించుకోవాలి మంత్రి కలెక్టర్‌లకు సూచించారు. రెండు, మూడు రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండల పరిషత్‌ సమావేశాల్లోనూ మొదటి అంశం కింద కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. కంటి వెలుగులో భాగంగా ప్రజలకు తమకు ఇష్టమైతే నేత్రదానం కోసం ముందుకు రావచ్చని మంత్రి సూచించారు. ఇదొక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15న ప్రారంభించనున్న కంటివెలుగు కార్యక్రమం మామిడాకులు, పచ్చతోరణాలతో పండుగ వాతావరణంలో జరగాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో పూర్తి అంధత్వాన్ని నివారించి అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో 799 వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో సుమారు 10 మంది సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చే అందరికీ కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని, కంటి సమస్యలు ఉండి శస్త్ర చికిత్స అవసరమైన వారికి మాత్రం ఉండవని స్పష్టం చేశారు. చికిత్స తరువాత అవసరమైతే వారికి
కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంత పెద్దమొత్తంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

తాజావార్తలు