కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు కోరారు. మంగళవారం
హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో నిర్వహించిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆ వార్డ్ కౌన్సిలర్ యరగని గురవయ్య గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కి కంటి వెలుగు కార్యక్రమంలో కండ్లను పరీక్షించి, దృష్టిలోపం ఉన్నవారికి కండ్ల అద్దాలను అందిస్తారు అని, ఇంకా ఏమైనా కంటి సమస్యలు ఉన్న వారికి సంబంధించిన వైద్యం కూడా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ యరగాని శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, కౌన్సిలర్లు జక్కుల శంబయ్య, గంగరాజు, యరగాని సత్యనారాయణ, బెల్లంకొండ ఎల్లయ్య, రమేష్ , మండల వైద్యాధికారి డాక్టర్ సన, కంటి వెలుగు వైద్యాధికారి సిహెచ్ సృజన, హెచ్ఈఓ ప్రభాకర్, ఆప్తమెట్రిస్ట్ స్వాతి, డీఈవో పావని, ఏఎన్ఎం కవిత, ఆశాలు సుశీల, జ్యోతి, ఉష, వెంకటరమణ, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.