కంటోన్మెంట్‌లో గుడిసెలకు నిప్పు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.అయితే

ఎలాంటి ప్రాణనస్టం జరగలేదని అధికారులు తెలిపారు. మడ్‌ ఫోర్డ్‌ లోని ఓ గుడిసె లో వంట చేస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి కాస్తా పక్కనున్న గుడిసెలకు వ్యాపించాయి. ఈ ఘటనలో మొత్తం 8 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.