కంటోన్మెంట్ ఆస్పత్రిలో వైద్య సేవలకు ఆమోదం: మంత్రి
హైదరాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): కంటోన్మెంట్ ఆసుపత్రిలో 15 రోజుల్లో గైనిక్ సేవలు ప్రారంభించ నున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆస్పత్రులను బలోపేతం/- చేయడంద్వారా పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తసీఉకుని వస్తున్నామని అన్నారు. శుక్రవారం ఆయన కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించారు. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న మంత్రి లక్ష్మారెడ్డి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లక్ష్మారెడ్డి… కంటోన్మెంట్ బోర్డుతో ఎంవోయూ చేసుకొని వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో అన్ని మౌలిక సందుపాయాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నా ప్రజలకు సేవలు అందడంలేదు. ఆస్పత్రి సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినం… వెంటనే స్పందించి మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించారని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.. ఇలాంటి పథకాలు కంటోన్మెంట్ ఆస్పత్రిలో అందడంలేదన్నారు. అయితే ప్రస్తుతం మంత్రి చొరవతో త్వరలోనే పథకాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.