కండే దేవేందర్ సేవలకు మరో అవార్డు…
పినపాక నియోజకవర్గం, సెప్టెంబర్4(జనంసాక్షి):- ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకు నిదర్శనం ఈ యువ కిషోరం.తన ఊహ తెలిసినప్పటికే తల్లి తండ్రి ని కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న తనని GTSSS అక్కున చేర్చుకుని ఉన్నత విద్య వైపు నడిపించింది.కసి పట్టుదల కలిగిన యువకుడి గా ఈ క్రమంలో కండె దేవేందర్ తనను తాను మలుచుకుని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విజయ తీరాల నడిచాడు.నాడు GTSSS తోటలో పెరిగిన నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు సారధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కంటి పరీక్షలు నిర్వహించి, బాధితులకు కంటి వైద్యం చేపించడంలో ముందు వరుసలో నిలిచి అనేకమంది అభిమానం చురగొని, అనేక ప్రశంసలు పొందాడు. ఈ సందర్భంలోనే విజయవాడ విజయం ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సెమినార్ లో రెటీనా కేర్ ప్రొఫెసర్ ఉమేష్ చేతుల మీదుగా “ఐ సైట్ సేవర్” గా మన్యంలో అనేక చోట్ల చేసిన “ఐ” క్యాంప్స్ సర్వీసు సేవలను గుర్తించి అవార్డు అందజేశారు