కందుని గ్యాంగ్‌రేప్‌ కేసులో ముగ్గురుకి ఉరి

2

– మరో ముగ్గురికి యావజ్జీవ ఖైదు

కందుని గ్యాంగ్‌ రేప్‌ కేసులో ముగ్గురికి మరణశిక్ష

మరో ముగ్గురికి జీవితఖైదు

కోల్‌కతా,జనవరి30(జనంసాక్షి): పశ్చిమ్‌బంగలోని కందుని ప్రాంతంలో 21ఏళ్ల కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోల్‌కతా కోర్టు దోషులకు శిక్షలను ఖరారు చేసింది. వీరిలో ముగ్గురుకి మరణశిక్ష, మరో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధించింది. గురువారం ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. 2013 జూన్‌లో కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని అపహరించి కందుని గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలోని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసు విషయంలో రాష్ట్రంలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు చేయగా.. తొమ్మిదో నిందితుడు విచారణ సమయంలో జైల్లో మరణించాడు. ఇప్పుడు కోర్టు ఆరుగురిని దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది.