కంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు?
న్యూఢిల్లీ,జనవరి13(జనంసాక్షి): త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరునున్ననేపథ్యంలో టీమ్‌ను బలోపేతం చేయాలన ఇప్రధాని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రత్యేక టీమ్ ఏర్పాఉటలో భాగంగా ఆయా రాస్ట్రాలకు పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా రెండోసారి ఎన్నిక తర్వాత ఈ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే కేంద్ర మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఈ మేరకు కేబినెట్లో మార్పులు జరగనున్నట్లు సమాచారం. మరోవైపు ¬ం, ఆర్థిక, రక్షణ, విదేశీ శాఖలను ఈ మార్పు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పనితీరులో వెనకబడ్డ మంత్రులపై వేటుకు రంగం సిద్ధం కాగా, మరికొందరి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బిహార్ నుంచి కేంద్ర మంత్రుల సంఖ్యను కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అమిత్ షా పదవీ కాలం ముగియనుండటంతో, ఆయనను తప్పించడానికి సీనియర్ నేతలు కొందరు అసమ్మతి గళాన్ని వినిపించారు. అయితే మెజార్టీ పార్టీ నేతలు మరోసారి అధ్యక్షుడిగా అమిత్ షా వైపే మొగ్గు చూపుతుండటంతో రెండో టరమ్ కూడా ఆయన ఎన్నిక తధ్యం. యూపి తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. వీటిని ధీటుగా ఎదర్కొనేందుకు ప్లనా/- చేస్తున్నారు. ఇందులో భాగంగా సమర్థ నాయకులను అన్వేషిస్తున్నారు.