కంపెనీల బిల్లుకు ఆమోదం లభిస్తుంది: ఐసీఎస్‌ఐ
హైదరాబాద్: కంపెనీన్ బిల్లు 2012కి తప్పక పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఎన్.ఐ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని కంపెనీ సెక్రటరీలకు హైదరాబాదులో అవగాహన సదస్సుని నిర్వహించింది. ఈ చట్టం ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందినందున బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందని వారు అభిప్రాయపడ్డారు. కంపెనీన్ బిల్లు- 2012 చట్ట కావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వృద్ధి తప్పక పురోగతిలో సాగుతాయని వారు విశ్లేషించారు. ఈ కొత్త చట్టం ప్రస్తుత విధానాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం వల్ల దేశ ప్రజలకు మేలు కలుగుతుందన్నారు.