కన్నడ రాజకీయంపై కోదండరామ్ వ్యాఖ్యలు
కరీంనగర్: కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మంచిది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లో టీజేఎస్ రాజకీయ శిక్షణా శిబిరం జరిగింది. ఈ శిబిరానికి హాజరైన ఆయన మాట్లాడుతూ… ఏ పార్టీలో గెలిచిన వారు ఏ పార్టీలోకి పోతున్నారో అర్ధంకాని పరిస్థితి ఉందని, అది మన తెలంగాణలో కూడా ఉందన్నారు. ఈ నెలాఖరులో రైతుబంధు, భూ రికార్డుల ప్రక్షాళన లోపాలపై పోరాటం చేస్తామన్నారు.