కన్నుమూసిన బాలమురళీకృష్ణ

19tvf_balamurali2_1241370gప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళం పల్లి బాలమురళీకృష్ణ(86) చెన్నైలోని తన నివాసంలో కన్ను మూశారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన ఆయన ప్రముఖ సంగీత విద్వాంసునిగా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి మృతి తీరని లోటని తన సంతాప సందేశంలో  చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సంగీతంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి తీరని లోటని  గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని తన సంతాప సందేశంలో ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.