కన్నుల పండుగ గా బగలాముఖి మూలమంత్ర

అమ్మవారి దర్శించుకున్న భక్తులు
శివ్వంపేట సెప్టెంబర్ 25 జనంసాక్షి :  మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శక్తిపీఠాలలో ఒకటైన బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం నిర్మాణ స్థలిలో ఉన్న బాలాలయంలో ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా  అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖి మూలమంత్ర హావనము అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రీత ద్రవ్యములతో హవనము, పూర్ణాహుతి, మంత్రపుష్పం, హారతులతో పూజారి కత్రువు లను ముగించారు. మహాలయ అమావాస్య పర్వదినం రెండు కలిసి రావడంతో తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బగలా ముఖి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా బగలాముఖి శక్తిపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ మాట్లడుతూ బగలా అంటేనే దుష్ట సంహారిణి, శత్రు సంహారిణి ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు.  అమ్మవారి పూజ కార్యక్రమాలలో స్థలదాత, టీఆరెఎస్ సీనియర్ నాయకులు పబ్బ రమేష్ గుప్త, హైకోర్టు న్యాయవాది వినయ్, వేద పండితులు చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు.
Attachments area