కన్న తండ్రే కాలనాగు
– నిగ్గు తేల్చిన పోలీసులు
రంగారెడ్డి మే 24(జనంసాక్షి):సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్యాచారం కేసులో తండ్రే నిందితుడని పోలీసులు తేల్చారు. నిందితుడు మెగావత్ కమల్ ను రంగారెడ్డి జిల్లా పోలీసులు విూడియా ముందు ప్రవేశ పెట్టారు. సంఘటన తర్వాత కమల్ పొంతనలేని సమాధానాలపై అనుమా నం వచ్చి, అతని కదలికలు గమనించామని పోలీసులు చెప్పారు. అతని సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించామని, రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామన్నారు. నమ్మకం బలపడి అతన్ని విచారించడంతో కమల్ నేరం అంగీకరించాడని రంగారెడ్డి జిల్లా ఎస్పీ, ఎఎస్పీ వెల్లడిం చారు.రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలంలో గురువారం రాత్రి మెగావత్ కమల్ అలియాస్ శ్రావణ్ తన కూతురు పద్నాలుగేళ్ల సిమ్రాన్ పై అత్యా చారం చేసి, హత్య చేశాడు. ఆటోలో
వచ్చిన ఐదుగురు తన తలపై కొట్టి, తన బిడ్డను తీసుకెళ్లారని కమల్ పోలీసులకు చెప్పాడు. ఆ రూట్లో తిరిగే 33 మంది ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారి దగ్గర ఎటువంటి క్లూస్ దొరకలేదు. మరోవైపు, కమల్ పై అనుమానంతో అతన్ని కూడా విచారించడంతో నిజం కక్కాడు.