కన్న తల్లిని హత్య చేసిన కన్న కొడకు
షాబాద్: మండలం కేంద్రంలోని పోచమ్మ అనే వృద్దురాలి కన్న కొడుకు తాగేందుకు డబ్బులివ్వలేదని హత్య చేశాడు. బుధవారం రాత్రి ఆమె కొడుకు బాస్కర్ మద్యం తాగేందుకు బబ్బులు కావాలని కోరాడు. ఆమె ఇవ్వనని చెప్పటంతో ఆగ్రహించి కర్రతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్త ప్రభుత్వాసుపత్రికి తరలించారు.