కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి
అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి;
టి ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ
కోదాడ టౌన్ జూలై 06 ( జనంసాక్షి )
కోదాడ మండల పరిధిలోని పులిచింతల పునరావాస గ్రామమైన అడ్లూరు ఆర్ అండ్ ఆర్ సెంటర్లో సుమారు ఎకరం నర భూమిని కబ్జా చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకొని భూమిని కాపాడాలని టిఎమ్ఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ డిమాండ్ చేశారు.బుధవారం ఆక్రమణకు గురైన భూమిని ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. గుడిబండ గ్రామానికి చెందిన రైతు వద్ద నుండి పునరావస లేఔట్ కొరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు.అట్టి భూమిని మరల రైతు కబ్జా చేసి సాగు చేసుకోవడం జరుగుతుందన్నారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని సర్వే చేయించి హద్దురాలు ఏర్పాటుచేసి కబ్జాదారుల నుండి భూమిని కాపాడాలన్నారు.అదేవిధంగా మిగిలిన నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో వానాకాలం సీజన్లో రైతు పంట వేయకుండా అడ్డుకుంటామన్నారు.ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వరి వెంట టీ ఎమ్మార్పీఎస్ హుజూర్నగర్ ఇన్చార్జ్ కృష్ణ బాబు మాదిగ,టిఎమ్ఆర్పిఎస్ జిల్లా వికలాంగుల అధ్యక్షులు కొమ్ము రామయ్య,సిహెచ్ సైదులు,గువ్వల రామకోటయ్య,రామాంజనేయులు,ప్రకాష్ రావు,వెంకట్ రెడ్డి,గువ్వల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.