‘కమలం’ వికసించేనా..?
(కరీంనగర్, జనంసాక్షి): బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లాకు చెందిన పొల్సాని మురళీధర్‌రావు తొలిసారి సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం మూడుగంటలకు ఆయన శంషాబాద్ విమానాక్షిశయానికి చేరుకోగానే ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు, కార్యకర్తలు తరలి ఈనెల 10న ఆయన సబ్ రిజిస్టార్స్ అసోసియేషన్ వారి నూతన డైయిరీ ఆవిష్కరణ సభలో కేసీఆర్‌తో కలసి పాల్గొని 12న కరీంనగర్‌కు రానున్నారు. కరీంనగర్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికి సమావేశం ఏర్పాటు చేయడానికి పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. తెరపైకి మూడో వర్గం నిన్నటివరకు చేనేత, పసుపు రైతుల సమస్యలపై , ఉత్తర తెలంగాణలో ప్రధాన సమస్యలపై పోరాటాలు, సెమినార్లు నిర్వహించిన పీ మురళీధర్‌రావు నేడు బీజేపీ అగ్రనేతల జాబితాలో చేరిపోవడంతో జిల్లా బీజేపీలో మూడోవర్గం తెలమిదికి రానుంది. ఢీల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడికు సలహాదారుడిగా, గట్కారీ కార్యవర్గంలో జాతీయ కార్యదర్శిగా పనిచేసిన జిల్లా వాసికి రాజ్‌నాథ్‌సింగ్ టీంలో ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. జిల్లాలో నిన్నటివరకు మాజీ కేంద్ర మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మధ్య వర్గ పోరు ఉండేది. ఇప్పుడు మురళీధర్ తెరమీదికి రావడంతో మూడోవర్గం వచ్చినట్లయింది. విద్యాసాగర్‌రావుకు నిరాశేనా…?
ఈసారి మోడి పవనాలు వీచే అవకాశం ఉండటం, తెలంగాణ బీజేపీతోనే సాధ్యమనే ప్రచారంతో కరీంనగర్ పార్లమెంటు నుంచి పోటీచేయాలనుకుంటున్న విద్యాసాగర్‌రావుకు మురళీధర్‌రావుకు కీలక పదవి లభించడం ఒకింత అడ్డంకిగా మారే అవకాశాలు లేకపోలేదు. పార్టీ నిర్ణయిస్తే కరీంనగర్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని మురళీధర్‌రావే ప్రకటించిన క్రమంలో జిల్లా బీజేపీలో కాంగ్రెస్‌ను మించిన వర్గపోరు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీధర్‌రావుకు కీలక పదవి లభిస్తుందనే ముందస్తు సంకేతాలు ఉన్నాయో ఏమోకాని వెంకయ్యనాయుడు రాక సందర్భంగా మాత్రం విద్యాసాగర్‌రావు, రామకృష్ణారెడ్డి వర్గాలు కలిసి పనిచేశాయి. మురళీధర్‌రావు సందర్భంగా వీరి సోపతి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటి విద్యాసాగర్‌రావు అనుచరుడిగా ఉండి, ఇప్పుడు వేరుగా రాజకీయం నడుపుతున్న కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పీ.సుగుణాకర్‌రావు మురళీధర్‌రావు వర్గంవైపు ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. మురళీధర్‌రావు, సుగుణాకర్‌రావులది ఒకే ప్రాంతమే కాదు, ఒకే ఇంటిపేరు ఉండటంపై కూడ ఈ ప్రచారం జరుగుతుంది.