కమల్ పాషా హవేలీలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 09(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఉరుసు కమల్ పాషా హవేలీలో ఆదివారం మహమ్మద్ ప్రవక్త 1484వ సంవత్సరం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గత రెండు వందల సంవత్సరాలుగా ఇదే హవేలీలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అలాగే వేలాదిమంది కి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు అదేవిధంగా మహ్మద్ ప్రవక్త కు చెందిన తల వెంట్రుకను దర్శనార్థం సందర్శకులకు చూపించారు ఈ కార్యక్రమంలో ఎహియా పాషా ఖాద్రీ అలియాస్ షేయబ్ బాబా దర్గా మౌలానా షర్ఫుద్దీన్ షఫీ యుద్దీన్ తదితరులు పాల్గొన్నారు