కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులు

పటిష్టంగా ఎన్నికల బందోబస్తు: కమిషనర్‌
కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): రామగుండం కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వివరించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో చేపట్లాల్సిన చర్చలను వివరించారు. ప్రాణహిత నది తీరంలోని ఆయా గ్రామాలను దృష్టిలో పెట్టుకుని నిఘాను పటిష్టం చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి అనుమానితులు వస్తే వారిని విచారించనున్నట్లు చెప్పారు. ప్రాణహిత తీరంలో ప్రత్యేక పోలీస్‌ పార్టీలతో
పాటు డ్రోన్‌ కెమెరాలతో పహారా ముమ్మరం చేసినట్లు తెలిపారు. మావోయిస్టుల నుంచి ఎలాంటి అంతరాయం కలగకుండా అపరిచిత కదలికలపై నిఘాను పెట్టినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు అమూల్యమైన ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునే విధంగా గ్రామాల్లో ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.  పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లను ముమ్మరం చేశామని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగే విధంగా భద్రత ఏర్పాట్లను చేపట్టామని సూచించారు. ప్రధాన రహదారుల్లో ఎప్పటికప్పుడు నిఘాపెట్టి తనిఖీ చేపట్టాన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుకున్న నగదును ఇతర అంశాల వివరాలను వెల్లడించారు. మావోయిస్టు ప్ర భావిత ప్రాంతాలను నిరంతరం నిఘా పెట్టి కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మా వోయిస్టు యాక్షన్‌ సభ్యుల ఫొటోలతో ముద్రించిన కరపత్రాలను కళాబృందాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.