కమిషన్ల కోసమే సంక్షేమ పథకాలు.

మల్కాజిగిరి.(జనంసాక్షి) అక్టోబర్ 10
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారి కమిషన్ల కోసమేనని,ఏ ఒక్క స్కీమును కూడా అమలు చేయలేదని అన్ని విషయాలు ప్రజల మధ్య బయటపెడతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా వ్యాఖ్యానించారు.
మంగళవారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రెండు ఎకరాలు కొని పది ఎకరాలు కబ్జా చేయడం మంత్రి మల్లారెడ్డి కే చెల్లుతుందని,ఆయన ప్రతి కాలేజీ చెరువులోనే ఉందని విమర్శించారు.మంత్రి మల్లారెడ్డి కి సంతకం పెట్ట నికే రాదని నేను చేసిన అభివృద్ధి ఫైల్లు తెప్పించుకొని చదవాలని అన్నారు. మల్కాజిగిరిలో మల్లారెడ్డి అల్లుడు ఎన్ని డబ్బులు పెట్టినా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.డబ్బులు ఇచ్చి మంత్రి అయిన అతని గురించి మాట్లాడడం వేస్ట్ అని అన్నారు. ఎమ్మెల్యే ఆయన నేను గల్లీ లీడర్ లాగా ప్రతి గల్లీ ఐదు సంవత్సరాలు తిరిగి ఎంత అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసని డబ్బులు పెట్టి మంత్రి అయిన అతనికి మల్కాజిగిరి గురించి ఏం తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మల్కాజిగిరిలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిఎన్వి సతీష్ కుమార్,పిట్ల శ్రీనివాస్,గుండా నిరంజన్,వెంకటేష్ యాదవ్, జీవన్ రెడ్డి,శ్రీనివాస్,ఉమేష్ సింగ్,జీడి సంపత్ గౌడ్,పంజా శ్రీనివాస్ యాదవ్, సంతోష్ రాందాస్,సానాది శంకర్,రోజా రమణి, గద్వాల జ్యోతి,మంద భాస్కర్,జాన్, పిట్టల నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.