కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేసిన మహనాయకులు ఓంకార్

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కమ్యూనిస్టులంతా ఐక్యంగా  ఉండి ప్రజల సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని కృషి చేసిన మహ నాయకులు ఓంకార్ అని ఎంసిపిఐయు రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్ లో గల బిఎన్ రెడ్డి విగ్రహం వద్ద ఎంసిపిఐయు వ్యవస్థాపకులు ఓంకార్ 14వ వర్ధంతి సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓంకార్  చిన్నతనం నుండే కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులై, బిఎన్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలతో కలిసి ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొని, ఆయుధం పట్టి పోరు నడిపిన ప్రముఖుల్లో ఓంకార్ ఒకరని అన్నారు.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు ఆర్థిక, సామాజిక,రాజకీయ సమన్యాయం జరగాలని,బహుజనులకే రాజ్యాధికారం రావాలని అనేకసార్లు అసెంబ్లీలో పోరాడారని గుర్తు చేశారు.వెనకబడిన సామాజిక వర్గాలైన బీసీలకు మురళీధర్ రావు కమిషన్ నివేదిక ఇచ్చిన రిజర్వేషన్లను బలపరిచిన వ్యక్తి ఓంకార్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కె నజీర్ , జిల్లా సహాయ కార్యదర్శి ఏపూరి సోమన్న , నాయకులు ఉగ్రయ్య , సుధీర్,సంతోష్, రవికుమార్,నాగరాజు, శబరి, మల్లేష్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.