కరణ్ కోటలో ప్రభుత్వ అనుమతి లేని కృష్ణవేణి పాఠశాల పై చర్యలు తీసుకోవాలి
జిల్లా విద్యాశాఖ అధికారిణి కోరిన వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , సెప్టెంబర్ 10
తాండూరు మండలంలోని కరణ్ కోట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతున్న కృష్ణవేణి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వివేకానంద విద్యాలయ కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకా దేవి అందజేసిన వినతిపత్రంలో కోరారు. కరణ్ కోట గ్రామంలో 2004 సంవత్సరం నుంచి సమర్థవంతంగా వివేకానంద విద్యాలయ పాఠశాలను నిర్వహించడం జరిగిందన్నారు. కొన్ని కారణాల వల్ల పాఠశాల నిర్వహణ బాధ్యతలను ఉపాధ్యాయురాలు కీర్తికి ఇవ్వడం జరిగిందని అన్నారు పాఠశాలను మూడు నెలల పాటు సమర్థవంతంగా నిర్వహిస్తే మూడు లేదా ఐదు సంవత్సరాల పాటు నిర్వహించుకునే విధంగా అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుందని ఆమెతో చెప్పినట్టు చెప్పారు. కానీ ఉపాధ్యాయులు కీర్తి నెల రోజులపాటు మంచిగా నిర్వహించి ఆ తరువాత తన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించ సాగిందన్నారు. తాను చెప్పిన విధంగా నడుచుకోవడం లేదని, ప్రవర్తన మార్చుకోవాలని పలుసార్లు సూచించిన కూడా ఉపాధ్యాయురాలు కీర్తి తన మాటలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినట్లు ఆయన పేర్కొన్నారు. చివరకు తనతో గొడవకు దిగి ఉపాధ్యాయులను, విద్యార్థులను మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న మరో పాఠశాలకు మార్చిందన్నారు. తాను ఏర్పరచిన కృష్ణవేణి స్కూల్ కు రెండు నెలల్లో గుర్తింపు వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రచారం చేసిందన్నారు. ఈ విషయమై అనుమతి లేకుండా కొనసాగుతున్న కృష్ణవేణి పాఠశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రంలో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి కోరారు. దీనికి డిఇఓ రేణుకా దేవి స్పందిస్తూ, తాండూర్ మండల విద్యాధికారితో విచారణ చేపట్టి అనుమతి లేని కృష్ణవేణి పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.