కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళన
కరీంనగర్: జిల్లాలోని రాయ్‌కల్ మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. మండలంలోని అల్లీపూర్‌లో విద్యుత్ అధికారులు అటోమెటిక్ స్టార్టర్లు తొలగిస్తున్నారని రైతులు ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారిపై బైటాయించారు. దీంతో ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది.