కరీంనగర్‌ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో దారుణహత్య చోటుచేసుకుంది. శుక్రవారం లక్ష్మణాచారి (25) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.