కరీంనగర్ పట్టణంలో విషాదం
సంపులో పడి విద్యార్థి దుర్మరణం
కరీంనగర్,జనవరి24 (జనంసాక్షి): జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పారామిత పాఠశాలలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాలలోని సంపులో పడి 9వ తరగతి విద్యార్థి అశ్విన్ మృతిచెందాడు. పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని తరలించింది. విద్యార్థి కుటుంబీకులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు మోహరించారు. పాటవాల యాజమాన్యం నిరల్‌క్ష్యం వల్ల్నే తమ కుమారుడు చనిపోయాడని ఆందోళన చేపట్టారు.
ఆటో బోల్తా: విద్యార్థులకు తప్పిన ముప్పు
విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం జనగామ జిల్లా శావిూర్‌పేట వద్ద చోటుచేసుకుంది. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం జనగామ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.