కరీంనగర్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా తీన్మార్ మల్లన్నకు మాట్లాడే నైతిక హక్కు లేదు జడ్పీ చైర్మన్  సుధీర్ కుమార్

ఎల్కతుర్తి,నవంబర్ 20(జనంసాక్షి)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీపీ మేకల స్వప్న,ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షులు గోడిశాల సమ్మయ్య గౌడ్ అధ్యక్షతన ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించిన హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న కు హుస్నాబాద్ గురించి తెలవదు ఈ ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పాలించింది ఇక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదు దామెరలో ఒకప్పుడు 1000 ఎకరాలు పంట పండేవి కాదు ఇప్పుడు 5 వేల ఎకరాల పంటలు పండిస్తున్నారు, సొసైటీ ద్వారా 20000 క్వింటాల వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ఎమ్మెల్యే సతీష్ కుమార్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కరీంనగర్ లో చేల్లని రూపాయి ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక పూటకో పార్టీలు మారే మల్లయ్య తో ఎన్ని మాటలు మాట్లాడించిన ఇక్కడి ప్రజలు నమ్మరు సతీష్ బాబు గెలుపు తథ్యం ఈ రాష్ట్రాన్ని కొంతమంది గుట్టలను కొల్లగొట్టేటోళ్లు కొంతమంది ,ఇక్కడున్న సొసైటీని కొల్లగొట్టేటోళ్లు కొంతమంది, తెలంగాణ కోసం కొట్లాడిండు అని చెప్పుకుంటున్నారు పేప్పర్ స్ప్రే కొట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదా మరి మీకు మీరే కొట్టుకుంటే మీ డ్రామాలను ఎవరు నమ్ముతారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లయ్య నిజా నిజాలు తెలుసుకుని చెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ, నగేష్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు బూరుగుల రామారావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు, రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరీ స్వామి, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగెడ మహేందర్, రాష్ట్ర నాయకులు గోల్లె మహేందర్, బిఆర్ఎస్ వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్, యూత్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్వి అధ్యక్షులు గోలి అఖిల్ పటేల్, సోషల్ మీడియా అధ్యక్షులు గుండేటి సతీష్, జాగృతి అధ్యక్షులు గోడిశాల విక్రమ్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు సాతూరి శంకర్,ఒడితల యువసేన అధ్యక్షులు చిట్టి గౌడ్, సీనియర్ నాయకులు పిట్టల మహేందర్, రాజేశ్వరరావు, ప్రసాద్,దేవేందర్ రావు,లోకిని సూరయ్య ,జంగం రాజు,వెంకన్న, శివాజీ, వెంకటేష్ యాదవ్, రాజ్ కుమార్, యూత్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, కార్తీక్, ఆర్కే, శ్రవణ్, నరేష్, సన్నీ, నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.