కరీమాబాదులో దుర్గామాత నిమజ్జనోత్సవం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో గురువారం రాత్రి దుర్గామాత నిమజ్జోత్సవం వైభవంగా జరిగింది. తొమ్మిది రోజులపాటు దుర్గామాతను భక్తిశ్రద్ధలతో పూజించిన స్థానిక ప్రజలు అమ్మవారిని డప్పు చప్పుల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు స్థానిక రంగసముద్రం చెరువులో నిమజ్జనం చేశారు. అంతకుముందు అమ్మవారికి ప్రజలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి యూత్ అసోసియేషన్ సభ్యులు స్థానిక గృహవాసులు పాల్గొన్నారు.