కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలి

కరవు జిల్లాను ఆదుకోవడంలో ముందుండాలి: సిపిఎం
అనంతపురం,జూన్‌7(జ‌నంసాక్షి): కరువు సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ అన్నారు. కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించిన వాటిలో కూడా సహాయ కార్యక్రామలు జరగలేదని  అన్నారు. జిల్లా రైతులకు వాతావరణ బీమాతో సంబంధం లేకుండా ఎకరాకు రూ.20 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా పదవ ఇ చేపట్టిన జగన్‌ జిల్లా కరవుపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటివరకు అనుసరించిన  విధానలు  రైతుల్ని రుణగ్రస్తులుగా మార్చేలా ఉన్నాయని అన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతావరణ బీమా, కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం, జిల్లా మంత్రులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతారణ బీమా రెండు కలిపి ఎకరాకు రూ.6 వేలు ఇస్తామనడం అన్యాయమని అన్నారు. వాతావరణ బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వేర్వేరుగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొత్త రేషన్‌ కార్డులు మంజూరు విషయంలో గతంలో  జన్మభూమి కమిటీ సిఫార్సుల దారులకే మంజూరు చేసారని అన్నారు. జన్మభూమి కమిటీ టిడిపి తమ కార్యకర్తలతో నియమించిన కమిటీనే అని అది రాజ్యాంగ కమిటీ కాదన్నారు. జన్మభూమి కమిటీ ద్వారా అవకతవకలు జరిగాయని అన్నారు.   చాలా మంది ఇళ్ల స్థలాలు వేసుకుని పట్టాలు లేకుండా జీవిస్తున్నారని వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.