కరువొచ్చింది.. సాయమందించండి
– తక్షణం వెయ్యికోట్లు మంజూరు చేయండి
– ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటి
తక్షణ సాయంగా రూ.3,064 కోట్లు మంజూరుకు వినతి
న్యూఢిల్లీ,మే10(జనంసాక్షి):తెలంగాణలో కరువు పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి సిఎం కెసిఆర్ వివరించారు. కరవు నివారణకు రూ.3,064 కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంళగవారం ఉన్నతాధికారులతో పాటు ప్రధాని మోదీని కేసీఆర్ కలిసారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, రాధామోహన్ సింగ్, జితేంద్ర సింగ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు గంటన్నరపాటు వివిధ అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం సీఎం కేసీఆర్ విూడియాతో మాట్లాడుతూ.. రాష్టాన్రికి కరవు నిధులు, పునర్విభజన చట్టం హావిూలపై ప్రధానితో చర్చించినట్లు వెల్లడించారు. కరవు నివారణకు చేపట్టిన తాత్కాలిక చర్యలను ప్రధానికి వివరించినట్లు తెలిపారు. కరువు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్టు ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. పునర్విభజన చట్టంలో భాగంగా వెనకబడిన ప్రాంతాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో కరువును శాశ్వతంగా నివారించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాకు అనుగుణంగానే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. వేసవి సెలవుల్లో కూడా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో సాధారణం కన్నా 14శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని ప్రధాని దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కరవు అధికంగా ఉందని, 7 జిల్లాల్లో 231 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించామని వెల్లడించారు. పంట రాయితీ, పశుగ్రాసం, ఉపాధిహావిూకి రూ.3,064 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రధానికి వివరించారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొవడానికి, కరువు నివారణ కోసం చేపట్టే పనులకు అవసరమైన నిధులను సమకూర్చాలని ప్రధానిని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువును ఎదుర్కొవడానికి తాత్కాలికంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. కరువును ఎదుర్కొవడానికి మంచినీటి సరఫరా, ఇన్‌పుట్ సబ్సిడీ, పశుగ్రాసం పంపిణీ, పిల్లలకు మధ్యాహ్న భోజనంలాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా ప్రజలకు మంచినీరు, పొలాలకు సాగునీరు అందించే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలను ప్రధాని అభినందించారు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, మంచినీటి సరఫరా, పశుగ్రాసం అందజేయడానికి ప్రజలకు ఉపాధి కల్పించడానినిధులు కావాలని కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. మిగతా నిధులను విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కరువు వల్ల 13.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. 21.78 లక్షల మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌లాంటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. 23,700 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, బత్తాయి, పసుపు, మిరపలాంటి తోటలు దెబ్బతిన్నాయన్నారు. కేంద్రం ఎంత త్వరగా నిధులు కేటాయిస్తే తాము అంత త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని వివరించారు. తెలంగానలో రైతలును ఆదుకోవడానికి 17వేల కోట్ల మేరకు రుణాలు మాఫీ చేశామని అన్నారు. దీనిని 36లక్షల మంది రైతులకు వర్తింపచేశామని అన్నారు. చెరువుల పురుద్దరణకు మిషన్ కాకతీయతో కార్యక్రమాలుచేస్తున్నామని అన్నారు. వివిధ కార్యక్రమాలను సిఎం వివరించారు. సిఎం వెంట డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తదితరులు ఉన్నారు. ఇదిలా వుండగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాధాన్యతలను తనకు కూలంకషంగా వివరించారని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రతీ గ్రామంలో ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగరీథను చేపడుతుండటంతోపాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నీటి సామర్థ్యం పెంచి సాగునీటి రంగాన్ని క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించినట్టు మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది అభినందించదగ్గ ఇషయమని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ళ సీఎం కేసీఆర్ సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రధానికి వివరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొవడానికి, కరువు నివారణ కోసం చేపట్టే పనులకు అవసరమైన నిధులను సమకూర్చాలని ప్రధానిని కోరారు. దీంతో పాటు వివిధ పథకాలను వివరించారు. వీటిపై మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఇదిలావుంటే తెలంగాణ రాష్టాన్రికి ఈయేడాది రూ.108 కోట్లు విడుదల చేశామని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమై రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై వివరించిన తర్వాత పలు అంశాలను పేర్కొంది. గ్రావిూణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టామని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారని తెలిపింది. నీటి సంరక్షణకు సాగునీటి అంశాలకు సంబంధించి అత్యుత్తమ విధానాలపై చర్చలు జరిపారని చెప్పింది. రిమోట్‌సెన్సింగ్, శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి నీటి ప్రవాహాల్లో ఏర్పడ్డ అడ్డంకులను గుర్తించి పూడికతీత పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రధాని సూచించినట్టు వివరించింది. పట్టణ మురుగునీటిని సవిూప గ్రావిూణ ప్రాంతాల్లో సాగుకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించినట్టు తెలిపింది. ప్రధాన మంత్రి సఫల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించినట్టు వివరించింది. కాంపా చట్టానికి సవరణలు తీసుకొచ్చినందుకు పీఎం మోదీకి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది.




