కరెంటు షాక్‌తో దంపతుల మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా కరెంటు షాక్ కొట్టి భార్య మృతించెందగా ఆమెను కాపాడబోయి భర్తకూడా మృత్యువాత పడ్డాడు.