కరోనా ఉత్పత్తి కేంద్రం వూహానే
ధృవీకరించిన కెనడా జన్యుశాస్త్రవేత్త
లండన్,డిసెంబర్16 (జనం సాక్షి): చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ వ్యాప్తి చెందినట్లు వస్తున్న ఆరోపణలు నిజమే అని మరో శాస్తేవ్రేత్త నిరూపించారు. ఆరోపణలను ఓ జన్యు శాస్త్రవేత్త నిజమే అని పేర్కొన్నారు. కెనడాకు చెందిన జీవకణ శాస్త్రవేత్త డాక్టర్ అలీనా చాన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆ దేశ పెద్దల సభకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ ముందు ఆమె ఈ విషయాన్ని తెలిపారు. కోవిడ్ మహమ్మారి వుహాన్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ నుంచే పుట్టినట్లు అలీనా చాన్ పార్లమెంట్ కమిటీకి వెల్లడిరచారు. వుహాన్ వైరాలజీ ఇన్స్‌టిట్యూట్‌తో లింకు ఉన్న పూరిన్ క్లీవేజ్ సైట్ నుంచి కరోనా వైరస్ ప్రబలినట్లు ఆమె తన రిపోర్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఉన్న దశలో.. కరోనా వైరస్ సహజంగా పుట్టిందని చెప్పడం కన్నా? ఆ ప్రాణాంతక వైరస్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆమె పార్లమెంట్ కమిటీకి స్పష్టం చేశారు. హునాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి మనుషుల ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని చాలా వరకు భావిస్తున్నారని, అయితే ఆ మార్కెట్ నుంచి సహజసిద్ధంగా వైరస్ వ్యాప్తి అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఆమె అన్నారు. ల్యాబ్ నుంచి లీక్ కావడానికి ముందు వైరస్‌లో జన్యు మార్పులు చేశారా అని కమిటీ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. మేటి వైరాజలిస్టులు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్లు వెల్లడిరచారు.