కరోనా కట్టడికై క్షేత్రస్థాయికి అధికారులు

` సూర్యాపేటలో సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ,డిజిపి మహేందర్‌రెడ్డి పర్యటన
` కరోనా విస్తరణతో స్థానిక అధికారుతో కలిసి పరిస్థితుపై ఆరా
` సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నిరంజన్‌పై బదిలీ వేటు
సూర్యాపేట,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):కరోనా కట్టడికి తెంగాణ ప్రభుత్వం కఠిన చర్యు తీసుకుంటున్నదని, సూర్యాపేట జిల్లాలో కూడా త్వరలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేస్తామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో పరిస్థితిని సవిూక్షించేందుకు సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో కసి రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారుతో కలిసి అక్కడికి వెళ్లారు. ముఖ్యమత్రి కేసీఆర్‌ ఆదేశా మేరకు హై లెవల్‌ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సందర్శి స్తున్నామన్న డీజీపీ.. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ ఇవ్వడానికే తాము వచ్చామని చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్‌ అము చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. కంటైన్‌ మెంట్‌ ఏరియాల్లోకి బయటివారు రాకుండా.. లోపలివారు బయటకు వెళ్లకుండా చర్యు తీసుకుంటు న్నామని చెప్పారు. భవిష్యత్‌లో వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఇచ్చే సూచను పాటించాని జిల్లా ప్రజను కోరారు. అన్నీ శాఖకు సహాయ సహకారాు అందిస్తూ పోలీస్‌ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పని చేస్తుందని డీజీపీ చెప్పారు. సూర్యాపేట నుంచి జోగులాంబ గద్వా జిల్లాలో వీరు పర్యటించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశా మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి జోగులాంబ గద్వా జిల్లాలో వైరస్‌ ప్రభావిత ప్రాంతాను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని వేదనగర్‌, మోమిన్‌ మొహ్లా ప్రాంతాను ఉన్నతాధికాయి తనిఖీ చేశారు. జోగులాంబ గద్వా జిల్లా ప్రత్యేక అధికారి రొనాల్డ్‌ రోస్‌, జిల్లా కలెక్టర్‌ శృతి ఓజా, ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికాయి కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నిరంజన్‌పై బదిలీ వేటు పడిరది. ఆయన స్థానంలో నూతన డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ బి.సాంబశివరావు నియమితుయ్యారు. కాగా జిల్లాలో కరోనా కేసు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక అధికారును నియమించింది.సీఎం కేసీఆర్‌ ఆదేశాతో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తదితయి బుధవారం సూర్యాపేటలో పర్యటిస్తున్న వేళలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు ఎక్కువగా నమోదు కావడానికి కారణమైన మార్కెట్‌ బజార్‌లో వీరు పర్యటించి వివరాు అడిగి తొసుకున్నారు. కాగా జిల్లాలోని 80 కేసుల్లో.. మార్కెట్‌ బజార్‌లోని వ్యాపాయి, వారి కాంటాక్టు నుంచి నమోదైనవి 65 కేసు ఉన్నాయి. అలాగే జిల్లాలో కరోనా కేసు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్‌ అధికారి సర్పరాజ్‌అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వు జారీ చేసింది. గతంలో ఆయన కరీంనగర్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎక్త్సెజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అలాగే సూర్యాపేట మున్సిపాలిటీకి కూడా ప్రత్యేక అధికారిని పెట్టారు. మున్సిపల్‌ పరిపానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వు జారీ అయ్యాయి. ఆయన గతంలో న్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేశారు. మున్సిపాలిటీలో కరోనా నియంత్రణ బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. అలాగే సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావును మంగళవారం రాత్రి బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు. ఈయన స్థానంలో హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్‌.మోహన్‌కుమార్‌ను నియమించారు. ఈయన బుధవారం విధుల్లో చేరనున్నారు. సూర్యాపేట డీఎస్పీగా నాగేశ్వర్‌రావు రెండున్నర సంవత్సరా పాటు పనిచేశారు. కాగా ఈయన హైదరాబాద్‌ డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు.
సూర్యాపేటలో మరో అధికారి బదిలీ
సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇవాళ తాజాగా మరో 3 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి వ్లెడిరచారు. దీంతో జిల్లాలో నమోదైన కేసు 83కి చేరాయి. వీటిలో సూర్యాపేట పట్టణంలోనే 54 కేసు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు సూర్యాపేటలో అధికారు బదిలీు కొనసాగుతున్నాయి. తాజాగా సూర్యాపేట పట్టణ సీఐ శివశంకర్‌ను నాగర్‌కర్నూుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌ నుంచి మరో అధికారి బాధ్యతు తీసుకోనున్నట్లు తొస్తోంది.సూర్యాపేటలోని కూరగాయ మార్కెట్‌ ప్రాంతంలో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ అధికాయి సకాంలో చర్యు తీసుకోలేకపోయారనే భావనతో ప్రభుత్వం ఇప్పటికే సూర్యాపేట డీఎంహెచ్‌వో నిరంజన్‌, డీఎస్పీ నాగేశ్వరరావును బదిలీ చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో సూర్యాపేట డీఎంహెచ్‌వోగా సాంబశివరావు, డీఎస్పీగా మోహన్‌ కుమార్‌ బాధ్యతు చేపట్టారు.

తాజావార్తలు